Wednesday, January 29, 2014

రోజంతా నీడలు మోస్తూ ..
భూమి ఇప్పుడే చీకటి కౌగిల్లో ఒదిగింది.!

* * *

చూరు కింద, గూటిలో చీకటి. 
పక్షులు నిశ్శబ్దంగా రేపటి కోసం ప్రార్దిస్తున్నాయి 

* * *

తలెత్తి నవ్వుతుంది పువ్వు
తనలాంటి స్వచ్చతను సవాలు చేస్తూ ..!

* * *

అక్షరాలన్నీ కుప్పనూర్చా
ఆకాశానికి పద్యాల ఊయలలేద్దాం రా..!

* * *

చదువు వలేసి ఉదయాన్నే
బాల్యాన్ని బుట్టలో వేసుకుంటూ స్కూళ్ళు

* * *

ఉదయాన్నే జనాలని మింగుతూ
నోళ్ళు తెరిచిన ఆఫీసులు

_____________ (29/1/2014)_____
బరువెక్కిన సూర్యుడు ??
సముద్రంలో పాపయిలా లాలపోసుకుంటాడు ..!

* * * *

స్వచ్చమైన నవ్వు పూసింది 
మనసుకైన చినుగుల్ని కుట్లేసుకుని ..!

* * * *

అక్షరం దిద్దుకుంటూ అందర్లో
పసి వేళ్ళు, రోజూ కొత్తగా మొలకెత్తుతాయి .. !

* * * *

ఎవర్నడిగినా వద్దన్నారు
ఆకాశపు వృక్షానికే మెరుస్తూ నక్షత్రాలు ..!

* * * *

ఈదుతున్న ఆకాశాన్ని చూసా
కాల్వలోంచి నది , నది నుంచి సంద్రానికి ..!

* * * *
________ (15jan2014)________

Friday, January 10, 2014

శబ్ధానికి మేల్కొనేది దేహం,

నిశ్శబ్దానికి మేల్కొనేది అంతరంగం ...!!



*  *  *  *


పుట్టుక ముందే పెట్టుంటాడు


దేవుడు, కళ్లలో నీటి మట్టం లెక్కల్ని..!



*  *  *  *తెగిన ఏకలవ్యుని వేలు


ఎందరో అర్జునులకు ద్వారబంధం..!?


*  *  *  *


పట్టాల్లా పరుచుకున్న కాలం,


మనుషులే రైళ్లలా ప్రయాణం చేస్తుంటారు..!!


*  *  *  *


రోజు ముగిసేముందు చూస్తాను


పలువురిచ్చిన స్వీట్ బాక్స్ లాంటి మాటల్ని..!


*  *  *  *