Wednesday, January 29, 2014

రోజంతా నీడలు మోస్తూ ..
భూమి ఇప్పుడే చీకటి కౌగిల్లో ఒదిగింది.!

* * *

చూరు కింద, గూటిలో చీకటి. 
పక్షులు నిశ్శబ్దంగా రేపటి కోసం ప్రార్దిస్తున్నాయి 

* * *

తలెత్తి నవ్వుతుంది పువ్వు
తనలాంటి స్వచ్చతను సవాలు చేస్తూ ..!

* * *

అక్షరాలన్నీ కుప్పనూర్చా
ఆకాశానికి పద్యాల ఊయలలేద్దాం రా..!

* * *

చదువు వలేసి ఉదయాన్నే
బాల్యాన్ని బుట్టలో వేసుకుంటూ స్కూళ్ళు

* * *

ఉదయాన్నే జనాలని మింగుతూ
నోళ్ళు తెరిచిన ఆఫీసులు

_____________ (29/1/2014)_____
బరువెక్కిన సూర్యుడు ??
సముద్రంలో పాపయిలా లాలపోసుకుంటాడు ..!

* * * *

స్వచ్చమైన నవ్వు పూసింది 
మనసుకైన చినుగుల్ని కుట్లేసుకుని ..!

* * * *

అక్షరం దిద్దుకుంటూ అందర్లో
పసి వేళ్ళు, రోజూ కొత్తగా మొలకెత్తుతాయి .. !

* * * *

ఎవర్నడిగినా వద్దన్నారు
ఆకాశపు వృక్షానికే మెరుస్తూ నక్షత్రాలు ..!

* * * *

ఈదుతున్న ఆకాశాన్ని చూసా
కాల్వలోంచి నది , నది నుంచి సంద్రానికి ..!

* * * *
________ (15jan2014)________

Friday, January 10, 2014

శబ్ధానికి మేల్కొనేది దేహం,

నిశ్శబ్దానికి మేల్కొనేది అంతరంగం ...!!



*  *  *  *


పుట్టుక ముందే పెట్టుంటాడు


దేవుడు, కళ్లలో నీటి మట్టం లెక్కల్ని..!



*  *  *  *తెగిన ఏకలవ్యుని వేలు


ఎందరో అర్జునులకు ద్వారబంధం..!?


*  *  *  *


పట్టాల్లా పరుచుకున్న కాలం,


మనుషులే రైళ్లలా ప్రయాణం చేస్తుంటారు..!!


*  *  *  *


రోజు ముగిసేముందు చూస్తాను


పలువురిచ్చిన స్వీట్ బాక్స్ లాంటి మాటల్ని..!


*  *  *  *



Saturday, October 12, 2013


ఎదో ఖాళీని పూరించే౦దుకే 

నువ్వూ - నేను దేవుని సృష్టిలో భాగమయ్యాం 


_________(29/10/2013)_______





చరిత్ర నిదురిస్తుంది 


పుస్తకానికీ పుస్తకానికి మధ్య ఖాళీలో 



________(17/10/2013)___




సముద్రం పాతదే తీరానికి 

నడిచే పాదాలు మాత్రం కొత్త ముద్దులిస్తాయి
 
_______(17/10/2013)__





ఊరు పెరిగి పెద్దదై


పట్నాన్ని పెళ్లి చేసుకుంది

_______ (12/10/2013)___

Sunday, December 2, 2012

FEMTOS  ( on 2dec2012)
------------------------------

ఒంటరి చలి వణికిస్తుంటే 

నీ మాటల సంగీతపు దుప్పటి కప్పుకున్నా ...






*   *    *   



కొన్ని ప్రశ్నలు నరికా 


నిజం చిందింది ... ఎరుపంత చిక్కగా ..




*   *    *   



పంచదార చూడు, నా కళ్ళపై 


కరిగించిగా మారిన నీ జ్ఞాపకాలు ...




*  *   *   



అద్దంలో నేను కాక నువ్వు 

కనిపించినప్పుడు .. అద్దం కాదది ప్రపంచం ...


*  *   *  


నీ జ్ఞాపకాలు మూటకట్టి

సంద్రంలో వేస్తే .. నీరంతా చేతిలో ముద్దయ్యింది ..





*     *     *     

ఇల్లంతా పరుగెత్తి మాటలు 


ప్రేమ పుస్తకపు  బోన్లో చిక్కాయి ..


*   *    *  

Thursday, November 29, 2012


రక్తపు మరకలంటిన 

నా రెప్పలివే.. రాత్రి కలను చంపావుగా... (30nov2012)




*  *   *   *   *



నే సాహసినే..." ప్రేమనే" 

రెండక్షరాల ఆయుధంతో జయిస్తూ.....(30nov2012)





*   *   *   *   *
గాలి భుజాలెక్కి
వలస పక్షినై వస్తున్నా...నీకై
_____________(30nov2012)


Sunday, November 4, 2012

సంతోషపు తాళం తీయాలంటే 
దు:ఖపు తాళపు చెవులు కావాల్సిందే