Sunday, December 2, 2012

FEMTOS  ( on 2dec2012)
------------------------------

ఒంటరి చలి వణికిస్తుంటే 

నీ మాటల సంగీతపు దుప్పటి కప్పుకున్నా ...






*   *    *   



కొన్ని ప్రశ్నలు నరికా 


నిజం చిందింది ... ఎరుపంత చిక్కగా ..




*   *    *   



పంచదార చూడు, నా కళ్ళపై 


కరిగించిగా మారిన నీ జ్ఞాపకాలు ...




*  *   *   



అద్దంలో నేను కాక నువ్వు 

కనిపించినప్పుడు .. అద్దం కాదది ప్రపంచం ...


*  *   *  


నీ జ్ఞాపకాలు మూటకట్టి

సంద్రంలో వేస్తే .. నీరంతా చేతిలో ముద్దయ్యింది ..





*     *     *     

ఇల్లంతా పరుగెత్తి మాటలు 


ప్రేమ పుస్తకపు  బోన్లో చిక్కాయి ..


*   *    *  

Thursday, November 29, 2012


రక్తపు మరకలంటిన 

నా రెప్పలివే.. రాత్రి కలను చంపావుగా... (30nov2012)




*  *   *   *   *



నే సాహసినే..." ప్రేమనే" 

రెండక్షరాల ఆయుధంతో జయిస్తూ.....(30nov2012)





*   *   *   *   *
గాలి భుజాలెక్కి
వలస పక్షినై వస్తున్నా...నీకై
_____________(30nov2012)


Sunday, November 4, 2012

సంతోషపు తాళం తీయాలంటే 
దు:ఖపు తాళపు చెవులు కావాల్సిందే 

Friday, November 2, 2012

FEMTOS
------------------
చలి కాచుకోడానికి 
కట్టెలు అయిపోయాయా ?? నా గుండె ఇదిగో 


*   *   *    *   *

నవ్వు మట్టిలో కన్నీటిని
కలిపి మనసు కలనే బొమ్మ చేస్తుందా?

*    *    *   *

పేదవాడికి కలలే 
ఖర్చులేకుండా దొరికే వస్తువులు కదూ !!

*   *    *    *   *

Thursday, October 25, 2012

FEMTO 'S
--------------
నా కన్నీటి చుక్క రాలి పడి
నీ జ్ఞాపకపు ఇంటిని కట్టే  ఇటుకైయ్యింది ..25OCT 2012

*   *    *   *   *  *


రెండు హృదయాలను కలిపి

కుట్టేదారం -ప్రేమ ...25OCT 2012

*  *   *  *  *  *  * 
FEMTO'S
----------------

కనురెప్పలకి అంటుకున్న
కలలు కడుగుతూ తూరుపు వెలుగు నీళ్ళు .. 31aug2012

*    *     *      *    *    *   *

 నవ్వుతో పుట్టి ముద్దుతో
పెరిగి కన్నీటితో ముగిసేది ప్రేమ-ట.. 31aug2012.

 *    *     *      *    *    *   *

చీకటవడంతోనే యుద్ధం- మొదలు ...
నాలో నాకు -నీ తలపులకు ! 31aug12.

*    *     *      *    *    *   *

 కను రెప్పలు పట్టుకొని
వ్రేలాడుతూ నీ జ్ఞాపకం ..కదిలించి రాల్చకు 31aug12.

*    *     *      *    *    *   *

 నా అక్షరాలకు రెక్కలుంటే
నీ వెనకే ఎగురుతూ తిరుగుతాయేమో 1sep2012.

*    *     *      *    *    *   *

కంచం లోంచి కింద పడ్డ
మెతుకు ఏడుపు తనపై ఎవరి పేరు లేదని 1sep2012.

*    *     *      *    *    *   *

 ఓడిన పక్కనోడి
జీవితం పాఠం అనుకోడు ... కాపీ కొట్టి రాయడట 1sep2012.

*    *     *      *    *    *   *

FEMTO'S
----------------------

ఆమె పుస్తకాన్ని తెరిచింది
మూల్గుతున్న అనుభవపు కట్లు విప్పాలని ..mm16aug2012.

*    *    *   *     *     *
 
ఆ పువ్వు గుండెలో
చల్ల చల్లని పుప్పొడుల కుప్పలు .mm 16aug2012.

*    *    *   *     *     *

తన నీడలో దూకి
ఆలోచన ఆత్మ హత్య చేసుకుంది ...mm 16aug2012.

*    *    *   *     *     *

ఒక్క సారి నీ ఊపిరివ్వు
నా భావానికి ఆక్సిజన్ కావాలి ..mm

*    *    *   *     *     *

 ఏంటి చినుకులన్ని ...
సీతాకోకలై నీ నవ్వును వెంబడిస్తున్నాయి mm25aug2012.

*    *    *   *     *     *
మబ్బుల ఊయలలో తాను
గాలితో గుస గుస లాడుతూ కొంటె చంద్రుడు 25aug2012.

*    *    *   *     *     *

కౌగిలిలో నారు పోసా నిన్ను
పంటగా నా జంటగా ఉండి పోతావని 25aug2012

*    *    *   *     *     *

.నా చీకటి ప్రపంచంలొ తన నీడ వెతుకుతూ .. నేను 26aug2012.

*    *    *   *     *     *

అదో ప్రతి అడుగులో తను
నాకై మారిన దారిగా కనిపిస్తూ .. 26aug2012.

*    *    *   *     *     *

కళ్ళు లేని వాళ్ళకి
నీడ ఎలా ఉంటుందో చెప్పమంటే ఎలా చెప్తావ్?. August 26 

*    *    *   *     *     *

నిద్రని అమ్మేసా తన
ప్రేమకి మందిరం కట్టాలని ... August 26 

*    *    *   *     *     *

మనసును కొస్తూ అదేదో
నీ జ్ఞాపకానికి నా పై పగ లేదుగా ప్రేమా 27aug2012.

*    *    *   *     *     *

 చీకట్లన్ని నావి చేసుకున్నా
వెలుగుల పరదాలని తనకోసం కొని 27aug2012.

*    *    *   *     *     *

నీ జ్ఞాపకాలు మొలిచాయి-
వేళ్ళకి ....అలుపెక్కడ నీకై అక్షరార్చనే 27aug2012.

*    *    *   *     *     *

 నాకు చిరాయువే - నీ ప్రేమలో mm -- 28aug2012.

*    *    *   *     *     *

 గులాబీ రాలినా ..
ముళ్ళు బ్రతికే ఉంటుందని నేర్చుకున్నా... 31aug2012
*    *    *   *     *     *
FEMTO'S
----------------

చూస్తున్నా చీమల దారుల్ని
ఏ భూమి పొరల్లో ఇల్లు కట్టుకున్నాయో ...mm. August 12 

*    *    *    *    *    *

నీకు నాకు మధ్య సంబంధం ...
మైనానికి ,దారానికి ఉన్న అనుబంధం mm. August 12 

*    *    *    *    *    *

రేయి పగలు
ఎప్పుడూ కలవని ప్రేమికులు mm. August 12 

*    *    *    *    *    *

హ్మం ఆ చూపుల మెలికలే ..
నవ్వుతూ ఆకాశం అరుణ వర్ణపు అరణ్యాన్ని పుట్టిస్తుంది. August 12 

*    *    *    *    *    *

ఇంకెంత కాలం ఈ నా ప్రపంచం
నీ జ్ఞాపకాలు తింటూ గొంగళిపురుగునై.. 13august2012.  

*    *    *    *    *    *

ఒక్క నవ్వు విసురు ..
గుండె తటాకం నిశ్చలంగా భయపెడ్తుంది .. 13august2012.

*    *    *    *    *    *

ఆలోచనల నారు పోసా
ఇలా వచ్చి ఉత్సాహపు నీరుపెట్టి పోరాదు..mm14aug2012.

*    *    *    *    *    *

ప్రతి ఉదయంలో నీ నవ్వే
ఉత్సాహానికి రెక్కలు కట్టి తీసుకొస్తూ ..mm14aug2012.

*    *    *    *    *    *

తన అడుగుల కిందే
నా ఊసులు ఊహలు పచ్చగడ్డిలా ..mm 14aug2012

*    *    *    *    *    *

సంకెళ్ళూ పాఠాలు నేర్పుతాయి
మందగించిన బుద్దిని సానబెట్టి ..mm14aug2012

*    *    *    *    *    *

నవ్వుతో నటన కోస్తుంటే స్నేహం,
సంతోషమై స్రవిస్తుంది ఎందుకో ..mm14aug2012.

*    *    *    *    *    *
 
పెదవంచు పై పగిలి పోయిన నవ్వు.....!!. August 13

*    *    *    *    *    *

 ప్రతి పొద్దులో పద్దులు చూస్తూ .
.జీవితం ..mm 14aug2012. August 13 

*    *    *    *    *    *

 కీటకమా??
మంచు తుంపర అంటారనుకుంటే. August 14

*    *    *    *    *    *

ప్రతి కన్నీటి చుక్క 
విరామ చిహ్నమే బాధకి ...
22oct2012

*   *     *    *    *   *

చీకటిని రాతిరిని 
ముడేసి ,ఊయలూగుతున్న తలపుల గాలి ...♥mm♥
22oct2012



*     *    *     *    *     *

నాకు నేను సమాజం.. మొదట...!! 
22oct2012

*     *    *     *    *     *

Thursday, October 18, 2012

FEMTO'S
-----------------

భాద్యతల బరువు పెరిగి -జీవిత దండెం తెగిపోక తప్పదు .. 19oct2012

* * * * *

ఆ గుండె చెడిపోయింది ... 
ప్రేమ చెప్పక దాయడం వల్ల కుళ్ళుపట్టి ....1june12

* * * * *

ఇది కన్రెప్పల తెరలపై
రంగుల కలల సినిమాలాడే సమయం ..mm..2august2012. 

* * * * *

నా కళ్ళు నవ్వుతాయట
ఇంకిపొయిన నదికదా ఎండకు మెరుస్తూ ...mm

* * * * *

 ఆమె ఒక గుస గుస
చల్లని సమీరంలా మాటల పూలు స్పృశిస్తూ ..mm..7aug2012. 

* * * * *

కరుగుతూ క్రొవత్తి నేలకై పరుగు
..విశ్రాంతిని పొందే స్థానం అక్కడే ..mm7aug2012

* * * * *

గోడలు మాటల్ని నింపుకొని
తను వెళ్ళాక పెచ్చులుగా రాలుస్తున్నాయి .... August 7 

* * * * *

 చిగురు ప్రశ్నించింది రంగులు
మారే ఒంటినా సమయంలో ఏమనాలని ..mm. August 8 

* * * * *

నా కళ్ళలో ఈదుతూ నువ్వు ...
ఏ జ్ఞాపకాల ముత్యాలు ఏరుతున్నావో ?. August 8 

* * * * *

బద్దకాన్ని ముక్కల్లు చేస్తే
గొంగళి పురుగులనుంచి సీతాకోకలైంది ..mm. August 10 

* * * * *

చీకటి కోణాల లెక్క
వెలుగు కొలతలకే తెలుసు mm. August 12 

* * * * *

FEMTO'S
--------------

త్రవ్వుతున్నా నా కోసం .... 
చీకటి దారుల్ని వెలుగు జాడల్ని ...3june12

* * * * *

జారవిడిచిన పట్టుదల .. 
సోమరితనానికి దొరికిందట లాక్కోపో ...3june12

* * * * *

పగిలిన కుండ పూలతొట్టిఇప్పుడు ..
ఆలోచన దారుల్లో జ్ఞానం వెదుకు ...3june12

* * * * *

త్సునామి ?? - "సముద్రం ఏడ్చింది .. "..2june12

* * * * *

మధుర జ్ఞాపకాల కోక 
చుట్టి నీ గుండెపై వాలా సీతాకోకచిలకై .. 2june12

* * * * *

ఎండతో ఎవరు రమ్మన్నారు ..
వానా ?? హత్తుకోలేదని ఎవరేడ్వమన్నారు ......2june12

* * * * *

రంగుల జ్ఞాపకపు
కోకచుట్టి నీ గుండెపై వాలా సీతాకోకచిలకై ...2june1

* * * * *

నాకు నేనే కొలమానం .. 
రేపటి లోతులు తెలుసుకొని ఈదుతూ ....1june12

* * * * *
FEMTO'S
--------------

జ్ఞాపకాన్ని ఇప్పుడే కోసి .. 
అనుభవాల సిగలో అలంకరించా ...4june12

* * * * * *

ఆ నుదుటిపై అడుగేసి సాహసం చేశా ..
సింధూరంలా మారి బందీనయ్యా ...4june12

* * * * * *

గుండె నిండా నమ్మకం
నింపింది అమ్మ .. ఈ ఉద్యోగం వస్తే చీర తీసుకెల్తా ....4june12

* * * * * *

ఎంతో చెప్పాలని ఉదయిస్తా .. 
నీ రాక కోసం ఎదురు చూస్తూ అస్తమిస్తా ....4june12

* * * * * *

సముద్రపు హృదయం పరుగు .. 
తీరాన్ని హత్హుకునే వరకు ...3june1

* * * * * *

గెలుపు జోళ్ళు .. 
ఎక్కడ పడితే అక్కడ అమ్మరు...3june12

* * * * * *

కలం చచ్చిపోయింది .. 
సిరా అంతా నీకోసం ఒలికించి ...3june12

* * * * * *

గాయం గానమాలపిస్తే... 
నువ్వే ఆ పాటకి పల్లవి,నేను చరణం ....3june12

* * * * * *

తన అసంతృప్తి అసహనం .. 
నా గుండెని మంట పెట్టే నిప్పు కణం ...3june1

* * * * * *
FEMTO'S
--------------

పచ్చద్దనం రోదిస్తుందే ...
 రగులుతున్న భూమి సెగలు తాళలేక ...5june12

* * * * *

నాలో నాకే పోటి .. 
నీవు లేని నేనుండగలనని ....5june12

* * * * *

నీచూపులే దూరదర్శినినాకు ..
నా భవిత చూపిస్తూ ...5june12

* * * * *

చెప్పే మాటలకన్న .. 
రాసి చూపే చేతులు మిన్న ...5june12

* * * * *

ఎలా పడి ఉన్నాయో చూడు-
నవ్వులన్ని ప్రేమ దారం తెగిపోయినట్టుంది......5june12

* * * * *

కొంచెం స్థలం యివ్వా నీ ప్రక్కన 
 నీ దాన్ని అని చెప్పుకొని మురిసిపోతా....5june12

* * * * *

చుక్కల్ని కోద్దాం వస్తావా..?
నా ప్రేమకి వాడిపోని పూలు కావాలట ....5june12

* * * * *

నవ్వడం నేర్పే మాస్టారు -
కావాలి .. నా కన్నీలకు ...5june12

* * * * *
FEMTO'S
--------------
ఆ అక్షరం పరుగెత్తోస్తూ ..

కాలు -విరగగొట్టుకుంది .. నిన్ను వర్ణించాలని .....6june12

* * * * *

నేనే గెలిచా ప్రేమా ..
నువ్వు లేకున్నా నే బ్రతికే వున్నా ...6june12

* * * * *

నేనే గెలిచా .. నువ్వు లేకున్నా ..
ప్రేమా " నే "బ్రతికే వున్నా ....6june12

* * * * *

చెదిరిపోయిన జుట్టునడ్గు నీ
వేళ్లంటే నాకెంత ఇష్టమో నని.......6june12
(ప్రేమగా నువ్వు సవరిస్తే ఆ ఒక్క క్షణం చాలు అనిపించదా )

* * * * *

చిరిగిపోయిన దుస్తులుఏడుస్తున్నాయి ..
ఇంతేనా నా అందమని ....6june12

* * * * *

ప్రేమ దుకాణం మూసేసిందట ... 
ఎందుకో కనుక్కొని చెప్పరు ?....6june12

* * * * *

గుప్పెడు ఆశలు .. దొసిళ్ళనిండా
కన్నీలు .. పిడికెడు మట్టి .. ...జీవితమా ??5june12

* * * * *

ప్రకృతి ప్రదర్శనశాల ??
ప్రకృతి అంటే ఏంటని పాప అడిగింది...5june12

* * * * *
FEMTO'S
--------------

ఉక్కగా ఉన్న పర్లేదు నీ గుండెలో ..
ప్రేమ శ్వాసలతో చల్లబడతాలే ...8june12

* * * * * *

నీ గుండె వాకిట నన్ను నాటా ...
 నీ నీడలో వున్నా చాలని .....8june12

* * * * * *

ప్రేమ కూడా ఈర్ష్య పడేంత ప్రేమ ..
నీది అందుకే కుళ్ళు లోకానికి ...8june12

* * * * * *

బానిసత్వం నశించాలని .
.ఫేంటోల్లా మారని అక్షరాల, భావాల ధర్నా ..8june12

* * * * * *

నిన్ను ద్వేషిస్తున్నా ...
నీ ప్రేయసి ప్రేమకై నన్ను కొమ్మకు వేరు చేసినందుకు ....8june12(గులాబీ )

* * * * * *

నా పేరే మరిచిపోయా ... 
నీ పేరుకి అలవాటుపడ్డ నేను ....8june12

* * * * * *

చెక్కిలిని చివరి సారి 
ముద్దాడే కన్నీటి నడుగు ఆ ఎడబాటు ...8june12

* * * * * *

మేఘాల ముంగురులు ..
గాలి -సవరిస్తే చిరుజల్లుల నవ్వు నవ్వింది ....8june12

* * * * * *

ఏ చికిత్స తీసుకోవాలి ? 
నీ ఎడబాటు చేసిన గాయాలు మానేందుకు .....7june12

* * * * * *