FEMTO'S
-----------------
-----------------
భాద్యతల బరువు
పెరిగి -జీవిత దండెం తెగిపోక తప్పదు .. 19oct2012
* * * * *
* * * * *
ఆ గుండె చెడిపోయింది ...
ప్రేమ చెప్పక దాయడం వల్ల కుళ్ళుపట్టి ....1june12
* * * * *
ఇది కన్రెప్పల తెరలపై
రంగుల కలల సినిమాలాడే సమయం ..mm..2august2012.
* * * * *
నా కళ్ళు నవ్వుతాయట
ఇంకిపొయిన నదికదా ఎండకు మెరుస్తూ ...mm
* * * * *
ఆమె ఒక గుస గుస
చల్లని సమీరంలా మాటల పూలు స్పృశిస్తూ ..mm..7aug2012.
* * * * *
కరుగుతూ క్రొవత్తి నేలకై పరుగు
..విశ్రాంతిని పొందే స్థానం అక్కడే ..mm7aug2012
* * * * *
గోడలు మాటల్ని నింపుకొని
తను వెళ్ళాక పెచ్చులుగా రాలుస్తున్నాయి .... August 7
* * * * *
చిగురు ప్రశ్నించింది రంగులు
మారే ఒంటినా సమయంలో ఏమనాలని ..mm. August 8
* * * * *
నా కళ్ళలో ఈదుతూ నువ్వు ...
ఏ జ్ఞాపకాల ముత్యాలు ఏరుతున్నావో ?. August 8
* * * * *
బద్దకాన్ని ముక్కల్లు చేస్తే
గొంగళి పురుగులనుంచి సీతాకోకలైంది ..mm. August 10
* * * * *
చీకటి కోణాల లెక్క
వెలుగు కొలతలకే తెలుసు mm. August 12
* * * * *
They are simply superb ... !!
ReplyDeleteనా కళ్ళు నవ్వుతాయట
ReplyDeleteఇంకిపొయిన నదికదా ఎండకు మెరుస్తూ...
.............................
em raayalo teliyatledu..
THANK YOU FAZLUR RAHMAN JEE
ReplyDeleteAND ELIA BABU GARU