FEMTO'S
--------------
--------------
జ్ఞాపకాన్ని ఇప్పుడే కోసి ..
అనుభవాల సిగలో అలంకరించా ...4june12
* * * * * *
ఆ నుదుటిపై అడుగేసి సాహసం చేశా ..
సింధూరంలా మారి బందీనయ్యా ...4june12
* * * * * *
గుండె నిండా నమ్మకం
నింపింది అమ్మ .. ఈ ఉద్యోగం వస్తే చీర తీసుకెల్తా ....4june12
* * * * * *
ఎంతో చెప్పాలని ఉదయిస్తా ..
నీ రాక కోసం ఎదురు చూస్తూ అస్తమిస్తా ....4june12
* * * * * *
సముద్రపు హృదయం పరుగు ..
తీరాన్ని హత్హుకునే వరకు ...3june1
* * * * * *
గెలుపు జోళ్ళు ..
ఎక్కడ పడితే అక్కడ అమ్మరు...3june12
* * * * * *
కలం చచ్చిపోయింది ..
సిరా అంతా నీకోసం ఒలికించి ...3june12
* * * * * *
గాయం గానమాలపిస్తే...
నువ్వే ఆ పాటకి పల్లవి,నేను చరణం ....3june12
* * * * * *
తన అసంతృప్తి అసహనం ..
నా గుండెని మంట పెట్టే నిప్పు కణం ...3june1
* * * * * *
No comments:
Post a Comment