FEMTO'S
--------------
--------------
ఉక్కగా ఉన్న పర్లేదు నీ గుండెలో ..
ప్రేమ శ్వాసలతో చల్లబడతాలే ...8june12
* * * * * *
నీ గుండె వాకిట నన్ను నాటా ...
నీ నీడలో వున్నా చాలని .....8june12
* * * * * *
ప్రేమ కూడా ఈర్ష్య పడేంత ప్రేమ ..
నీది అందుకే కుళ్ళు లోకానికి ...8june12
* * * * * *
బానిసత్వం నశించాలని .
.ఫేంటోల్లా మారని అక్షరాల, భావాల ధర్నా ..8june12
* * * * * *
నిన్ను ద్వేషిస్తున్నా ...
నీ ప్రేయసి ప్రేమకై నన్ను కొమ్మకు వేరు చేసినందుకు ....8june12(గులాబీ )
* * * * * *
నా పేరే మరిచిపోయా ...
నీ పేరుకి అలవాటుపడ్డ నేను ....8june12
* * * * * *
చెక్కిలిని చివరి సారి
ముద్దాడే కన్నీటి నడుగు ఆ ఎడబాటు ...8june12
* * * * * *
మేఘాల ముంగురులు ..
గాలి -సవరిస్తే చిరుజల్లుల నవ్వు నవ్వింది ....8june12
* * * * * *
ఏ చికిత్స తీసుకోవాలి ?
నీ ఎడబాటు చేసిన గాయాలు మానేందుకు .....7june12
* * * * * *
No comments:
Post a Comment