FEMTO'S
----------------------
ఆమె పుస్తకాన్ని తెరిచింది
మూల్గుతున్న అనుభవపు కట్లు విప్పాలని ..mm16aug2012.
* * * * * *
ఆ పువ్వు గుండెలో
చల్ల చల్లని పుప్పొడుల కుప్పలు .mm 16aug2012.
* * * * * *
తన నీడలో దూకి
ఆలోచన ఆత్మ హత్య చేసుకుంది ...mm 16aug2012.
* * * * * *
ఒక్క సారి నీ ఊపిరివ్వు
నా భావానికి ఆక్సిజన్ కావాలి ..mm
* * * * * *
ఏంటి చినుకులన్ని ...
సీతాకోకలై నీ నవ్వును వెంబడిస్తున్నాయి mm25aug2012.
* * * * * *
మబ్బుల ఊయలలో తాను
గాలితో గుస గుస లాడుతూ కొంటె చంద్రుడు 25aug2012.
* * * * * *
కౌగిలిలో నారు పోసా నిన్ను
పంటగా నా జంటగా ఉండి పోతావని 25aug2012
* * * * * *
.నా చీకటి ప్రపంచంలొ తన నీడ వెతుకుతూ .. నేను 26aug2012.
* * * * * *
అదో ప్రతి అడుగులో తను
నాకై మారిన దారిగా కనిపిస్తూ .. 26aug2012.
* * * * * *
కళ్ళు లేని వాళ్ళకి
నీడ ఎలా ఉంటుందో చెప్పమంటే ఎలా చెప్తావ్?. August 26
* * * * * *
నిద్రని అమ్మేసా తన
ప్రేమకి మందిరం కట్టాలని ... August 26
* * * * * *
మనసును కొస్తూ అదేదో
నీ జ్ఞాపకానికి నా పై పగ లేదుగా ప్రేమా 27aug2012.
* * * * * *
చీకట్లన్ని నావి చేసుకున్నా
వెలుగుల పరదాలని తనకోసం కొని 27aug2012.
* * * * * *
నీ జ్ఞాపకాలు మొలిచాయి-
వేళ్ళకి ....అలుపెక్కడ నీకై అక్షరార్చనే 27aug2012.
* * * * * *
నాకు చిరాయువే - నీ ప్రేమలో mm -- 28aug2012.
* * * * * *
గులాబీ రాలినా ..
ముళ్ళు బ్రతికే ఉంటుందని నేర్చుకున్నా... 31aug2012
* * * * * *