Thursday, October 18, 2012

FEMTO'S 
--------------

వానా ఇక్కడే ఉండు...
లోపలి కొచ్చావో మా అమ్మ నీ చెవి కూడా మెలేస్తుంది....♥ 18june2012..

* * * * *

హే వాన మూటకట్టిన జ్ఞాపకాలను విప్పకు ..
రోజు నువ్వు రావుగా ...♥ 17june2012

* * * * *


తాకట్టు పెట్టి మర్చిపోయాడు జీవితాన్ని ....
ఇప్పుడు విడిపించుకోలేడట ...17june2012

* * * * *

మనసుపై పూలురాలుతున్నాయి ....
కాదు అవి తన ఫేంటోలు ...♥ 16june2012

* * * * *

ప్రేమ నీటిని కదిలిస్తున్న శబ్దం ...
నా గుండె చెరువులో నీ కాళ్ళూపుతూ ....♥ 15june2012

* * * * *

పాటకెక్కడి ప్రాణం ...
నీ ప్రేమ భావమే దూరమైనా క్షణం ♥15june2012

* * * * *

ప్రతిరోజు బ్రతికొస్తున్నా సాధించనిదేదో మిగిలుందని .....
ఉదయమై ...♥ 15june2012

* * * * *

తెరిచిన కళ్ళముందు ...
 కన్పించే మొదటి రూపం పచ్చని ఫేంటో వనం ...♥ 15june2012

* * * * *

No comments:

Post a Comment