FEMTO'S
-----------------
-----------------
రూపు లేని రేపు కోసం ..
నేటి ముస్తాబు ...13may12
* * * * * *
* * * * * *
అక్షరాలకే గొడవ ..నేను-
ముందంటే ముందని"అమ్మని" వర్ణించడానికి ...13may12
* * * * * *
కన్న వారికోసం సుఖాలనే
పట్టించుకోనంత త్యాగం ఎవరికుంది అమ్మ ...13may12
* * * * * *
కనీళ్ళ కౌగిలింత కళ్ళతో
చివరి సారి .. వీడ్కోలు దారిలో నీకై జారి ..13may12
* * * * * *
గాలి నడక.. చల్లదనపు
పవిటేసి వర్షపుమువ్వలు కట్టి ..13may12
* * * * * *
ఆ నీడ నీదనుకునేవు..
నీ నీడగా మారిన నేను ..12may12
* * * * * *
చూపుల తాళపు గుత్తులతో ..
ఇంకా ఎన్ని గదులు తెరవాలి నా గుండెలో ..12may12
* * * * * *
జాతీయ పానీయం -- భారత్లో ...
తిండి దొరకని వాళ్ళ అమృతం అదే అని ...12may12
* * * * * *
ముక్కుపై కూర్చున్న కోపం ..
ముక్కెరై తన అందాన్ని పెంచుతూ ...12may12
* * * * * *
గుండె గిల్లావ్ ...
కందిపోయేది నీ బుగ్గే అని తెలియక ..12may12
* * * * * *
చీకటి మూటలో నేను ఉన్నా...
జ్ఞాపకం అని నన్ను అందులో చుట్టేసాడుగా ...12may12
* * * * * *
తలబడుతున్న చూపులు ..
గెలుపు ఓటముల్లో ఒకటవుతూ ...12may12
* * * * * *
రాలిపోతున్న ఆకును ..
పండలేదు .. నీ జ్ఞాపకం కోసివెల్లింది ..11may12
* * * * * *
ఎర్రబడ్డ కళ్ళు ..
చీకటిలో కూడా నిన్ను చూస్తూ ...11may12
* * * * * *
ఇంకా అనే మాటలో ...
ఎంత ఇరుకో !! ...11may12
ఎంత ఇరుకో !! ...11may12
* * * * * *
No comments:
Post a Comment