FEMTO'S
---------------
---------------
వెండి మబ్బుల్లో ...
ముద్ద బంగారం నా రేరాజు ....5may12
* * * * * *
* * * * * *
నమ్మకం గుడ్డిదవుతుంది ..
అప్పుడప్పుడు ...5may12
* * * * * *
చెక్కర కలలకి కళ్ళలో చోటు లేదు ..
చేదు నింపి వెళ్ళావ్ కదా ...5may12
* * * * * *
ఎంత ఇచ్చి కొన్నావ్ ధైర్యం ..
చాలా నిఖార్సుగా ఉందే ...5may12
* * * * * *
పెట్టుబడి పెట్టు చిరునవ్వు ..
చిన్న మొత్తాల్లో ...4may12
* * * * * *
చీకటంతా కళ్ళలోనేదాచిపెట్టు ..
ఉదయమే సూర్యునికి ఇచ్చేద్దాం ...4may12
* * * * * *
ఈ రోజు ముగిసేలోపు ..లెక్కలు
చూసుకున్నావా .. జీవితం ఏమిచ్చింది ? ..4may12
* * * * * *
నేను రంగులు తెలియని
వర్షం నాతో పాటు నువ్వు హరివిల్లులా రాకు ..4may12
* * * * * *
No comments:
Post a Comment