FEMTO'S
-----------------
-----------------
నా ఆలోచనల చీమలు
నీ చుట్టే పంచదార బొమ్మ .. 6may12
* * * * * *
* * * * * *
ఆ అలకలో నీ అందానికి
కలువలే చిన్నబోవ .. 6may12
* * * * * *
* * * * * *
చల్లని -వేడి జ్ఞాపకాలతో
ఈ ఇల్లు మిగిలిపోయింది నీవు లేక ..6may12
* * * * * *
* * * * * *
చావలేని నిజం ..
చావు లేని నిజం ...5may12
* * * * * *
* * * * * *
కళ్ళ ఆల్చిప్పలలో నీవు
దొరికావు .. నిద్దురవై కురిసావుగా ప్రేమా ...6may12
* * * * * *
* * * * * *
నాకిస్తావుగా ఎప్పుడు తొలి-
అవకాశం ..అదే చావుకి కుడా చెప్పి పెట్టా ..6may12
* * * * * *
* * * * * *
నా ప్రేమేగా నిన్ను అహంకారిని చేసింది ...6may12
* * * * * *
* * * * * *
ప్రశ్నల విత్తనాలు ఖాళీ -
అయ్యాయి .. నువ్వే దొంగిలించావా ? ..5may12
* * * * * *
* * * * * *
ఆశల తెడ్లు వేస్తూ శూన్యంలో
నీకై నే చేసింది సాహస ప్రయోగమే ప్రేమా ..!! 5may12
* * * * * *
* * * * * *
ప్రేమ బక్కచిక్కిందట ..
తిరిగి తిరిగి నీ చిరునామా కోసం ...5may12
* * * * * *
* * * * * *
ఈ ఒక్కసారికి నమ్ముతున్నా ...
ఈ సారైనా నిజాన్ని బ్రతికించు ..5may12
* * * * * *
* * * * * *
నీ చిరునవ్వు పుస్తకంలో
నాకై రాసిన సమాధానమెలా వెతకను ?..5may12
* * * * * *
* * * * * *
కలల నావనెక్కి నిన్ను-
చేరా చీకటి దారుల్లో ఎంత కష్టమయ్యిందో ..5may12
* * * * * *
* * * * * *
No comments:
Post a Comment