Tuesday, October 16, 2012

FEMTO'S 
---------------


దిగేదాకా నీ ప్రేమ మేకులు...
కొడుతూనే ఉంటా నా గుండెపై .. ప్రేమోన్మాదిని ...21may12

*   *   *   *   *   *   *

తను శిలలా మారేప్పుడు .. 
నా హృదయం ...లేని నీకై ఎంత వెదికిందో ...21may12

*   *   *   *   *   *   *

సంతోషం విలువ .. 
కష్టాల కొలిమిలో కాలిన నవ్వుకే తెల్సు ...21may12

*   *   *   *   *   *   *

ఓటమిని విత్తనం లా నాటు ... 
చచ్చి గెలుపు మొలకై సంతోషం ఇస్తుంది ..21may12

*   *   *   *   *   *   *

చీకట్ని గెలిచేది వెలుగు ..
ఓటమిని చీల్చుకుని వచ్చేదే గెలుపు ...21may12

*   *   *   *   *   *   *

ఆ కలకు జీవిత ఖైదు ..
కళ్ళలో బందీ వాస్తవం అంగీకరించదని...21may12

*   *   *   *   *   *   *

గుండె గోడలపై గీసిన 
గీతలు రాతలు నీ జ్ఞాపకాల చిహ్నాలా ...20may12

*   *   *   *   *   *   *

పిచ్చోడు .. 
చావుకు కూడా లంచం ఇస్తాడట .. 20may12

*   *   *   *   *   *   *

నిదుర పల్లకి ఎక్కి .. 
కలలు బయల్దేరాయి కళ్ళ వాకిళ్ళ సాక్షిగా ...20may12

*   *   *   *   *   *   *

నీ ఆలోచనల రాపిడిలో .. 
నలిగిపోతున్న నా ఊహ ....20may12

*   *   *   *   *   *   *

No comments:

Post a Comment