Tuesday, October 16, 2012

FEMTO'S 
----------------


నీ పెదాలకి .. నా చెవులకు 
జరిగిన రహస్య ఒప్పందం ..చనువు సాక్షి...7may12

*   *   *    *   *   *


చిరునవ్వు సంతకంతో తన
ప్రేమను జీవితాన్ని నాది చేసింది ...7may12

*   *   *    *   *   *


దాటుతున్నా నిద్రను ..
కలల వంతెననెక్కి ఆవలి రేపటికి ..7may12

*   *   *    *   *   *


నా రంగులన్నీ నీ నవ్వుకోసం
ఇచ్చి నేను ఖాళీగా మిగిలిపోయా ...7may12

*   *   *    *   *   *


నా మనసు తన బానిస... 6may12

*   *   *    *   *   *


కంట నీరు పొంగే వరకు
తెలియదట ... తనకు మనసు వుందని ..6may12

*   *   *    *   *   *


నవ్వుల వీదిలో తన ఇల్లు 
మార్చాడు ... ప్రేమను ఏడుపుల పాలు చేసి ..6may12

*   *   *    *   *   *


మాటలు ఉచితమేగా ... 
అందుకే సలాహాలకి కొదువలేదు ..6may12

*   *   *    *   *   *


ఆ ప్రేమ ..అమ్ముడు పోయింది ..
లక్షల కట్నానికి ...6may12

*   *   *    *   *   *


నీ నవ్వు .. దారాలతో దూర 
తీరాలని కొలిస్తే ..తెల్సిందింత దగ్గరని ...6may12

*   *   *    *   *   *

No comments:

Post a Comment