FEMTO'S
-----------------
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
-----------------
గుండెని తెరిచి చూడకు ..
అన్ని త్రుప్పు పట్టిన జ్ఞాపకాల వస్తువులే ...11may12
* * * * * *
* * * * * *
ఎప్పుడూ వర్ష రుతువైనా కష్టమే .. ఇష్టంలో ...11may12
* * * * * *
తన మాటల్లో కత్తెర ...
నా కోరికలు చెప్పకుండానే కత్హరిస్తూ ...11may12
* * * * * *
నిన్ను కాపాడుకోడానికి
నేను ముళ్ళు లాగానే వుండాలి ...11may12
* * * * * *
ప్రేమిస్తున్నా..
బిక్షగత్తెలా చూడకు ...11may12
* * * * * *
జీవితకాలం గడిచింది ..
మళ్ళీ మొలకెత్తడానికి విత్తనం అవ్వు ...11may12
* * * * * *
కళ్ళు రాజీనామా చేస్తాయట
ఎదురు చూపుల ఉద్యోగం చేయలేక ...11may12
* * * * * *
నా కనుల చెలమలో ఊరే నీరు ..
నీ ప్రేమ పాదాలు తాకాలని ...11may12
* * * * * *
అదరాల మీదే ఆసినమైనీ పేరు ..
ప్రతి మాటను దాటి పోనివ్వక ...11may12
* * * * * *
నీ మాటలో లోతులు ..
మునిగిపోతున్న నాకు మాత్రమే తెలుసు ...11may12
* * * * * *
నా పెదాలకి నవ్వు తెలుసు ..
నా గుండెకి నువ్వు తెలుసు .. అందుకే ఈ బాధ ...10may12
* * * * * *
No comments:
Post a Comment