Tuesday, October 16, 2012

FEMTO'S
---------------


ఒక్క క్షణం నీవు నా జీవితం 
అవుతావా ? ఊపిరి నీకిచేస్తాను ...1may12

*   *     *     *    *   *

నా సమాధిని చూసే నీవు ... 
నీలో నే బ్రతికి లేననే గా .. ?..1may12

*   *     *     *    *   *

అబద్ధానికి నవ్వొస్తుంది ... 
తనని నమ్మి ఎత్తుకునే వాళ్ళని చూసి ..1may12

*   *     *     *    *   *

పొద్దు పోలేదు .. కాని 
దీపానికి వెలిగించబడాలని ఆశ ....1may12

*   *     *     *    *   *

నేనెవరో నీకు తెలిస్తే 
చెప్తావా.. ??" నేను "-నన్ను "అడుగుతున్న ప్రశ్న ...1may12

*   *     *     *    *   *

తాగి తూలుతున్న నిజం ..
 అండ ఎవరు లేరని ..1may12

*   *     *     *    *   *

ఆ చెమటకెంత ధైర్యం ... 
అసాధ్యాన్ని చీల్చి సాద్యం చేసిందట ..1may12

*   *     *     *    *   *


తెరలు తెరలుగా .. అవే 
ప్రశ్నలు .. అలలవుతూ మనిద్దరి మధ్య ....1may12

*   *     *     *    *   *

No comments:

Post a Comment