Thursday, October 18, 2012

FEMTO'S 
-----------------
ఆ మనసుపై రక్తపు మరకలు ...

స్వేచ్చా భావాన్ని ఎవరో చంపారు ....12june12

* * * * *

పొదుగుకే తెలుసు పాలిస్తూ ... 
నొప్పి భరించడం ... గుండె పిండి భావం తీయడం 12june12

* * * * *

మనసు ఇరుసుపై
మాటలత్రాడు వేసి నా భావాలను తోడకు ....12june12

* * * * *

జీవనచిత్రం .. చిత్రంగా ఇప్పుడు
కొత్తరంగు పులుమికుని నవ్వింది ...11june12

* * * * *

నీలో నన్ను చూసా ..
నా ఆలోచనల అంగవైకల్యం కనిపించింది ....11june2012

* * * * *

ఎవరు నువ్వు ??
మూగ మనసుతో మాట్లాడించావ్ .... 11/6/2012

* * * * *

నేను విరిగిన గాజును .. 
ఇంకా నీ ప్రేమ రంగులనే ప్రతిబింబిస్తూ .....11june12

* * * * *

No comments:

Post a Comment