Thursday, October 18, 2012

FEMTO'S
--------------


నీ శ్వాస కబురు చూసి ... 
రాల్చుకున్నా కోరికల వృక్షం చిగురించింది .....15june2012

* * * * *

నిట్టూర్పుని చీపురుగా చేసి ..
ఊడ్చేస్తున్నా..నువ్వు లేని నక్షత్రాలెందుకని........15june2012

* * * * *

హరివిల్లులో దాక్కున్నావ్వా ?
నా చీకటి గుండెని ఇష్టపడక .....15june12

* * * * *

గుండె పొరల్లో నీ స్వరం చేరి ... 
నా నిశబ్దాన్ని ప్రేమిస్తుంది ....15june12

* * * * *

ఎటు చూసినా ..
కుప్పలు పోసిన మాంసపు ముద్దలే మనుషులు .....14june2012

* * * * *

మతిమరుపుల్లో కూడా మెరుస్తుంటావ్ ..
మస్తిష్కానికి పాదరసమై....14june12

* * * * *

ఆ గుండెకి తలుపులు లేవు ..
నీ తలపుల రాకకు అడ్డం ఉండొద్దని ....14june12

* * * * *

నీ చూపుల స్పర్శ చాలు ..
అదే ప్రకృతి వైద్యం నా గుండెకి .....14june12

* * * * *

No comments:

Post a Comment