FEMTO'S
---------------
* * * * * *
* * * * * *
---------------
నువ్వు లేనందుకా ఈ
చీకటి యుగంలాగ వుంది ... 19may12
* * * * * *
* * * * * *
వెలిగించి వదిలేసావ్ ..
నన్ను ఎక్కడ పెట్టాలో కూడా ఆలోచించక ..19may12
* * * * * *
రవాణా చెయ్యి ఆలోచనలు ...
నీ నుంచి నాలోకి నా " శ్వాసవై "....19may12
* * * * * *
నీ దారిలో పరుచుకున్నా"నే "..
ఎర్రతురాయి పూలై నీ పాదాలు ముద్దాడుతూ ...19may12
* * * * * *
* * * * * *
ఓటమి నా నేస్తం ... విజయపు
దారులు చూపిస్తూ.. సరిచేస్తూ ..19may12
* * * * * *
* * * * * *
ఎంత వేగామో ఆ చూపులో ..
వేల మందిలో నన్ను ఇట్టే పట్టేయగలదు ...19may12
* * * * * *
* * * * * *
ప్రకృతికి అలుపొచ్చిందట...
వైపరీత్యాల నిట్టూర్పులు విడుస్తుంది....18may2012
* * * * * *
* * * * * *
తన మాటలు పోతపోసి
విగ్రహం చేశా ... ఎప్పుడూ వెంట ఉండలేడని ...17may12
* * * * * *
* * * * * *
అరుణ కాంతిలా వస్తావని ...
ఈ చీకటి దారుల్లో నా ఎదురుచూపు ...13may12
* * * * * *
* * * * * *
No comments:
Post a Comment