Tuesday, October 16, 2012

FEMTO'S
--------------


అర్ధం లేకుండా 
నువ్వే పని చేయవు కదా .....26may12

*  *   *   *   *   *   *

భావాలన్నీ అక్షరాలై 
మొలుస్తున్నాయి నీ పేరు వినగానే ...25may12

*  *   *   *   *   *   *


నీ ప్రేమే నాకు నమ్మకం నేర్పింది ..
అబద్ధం చూసినా నమ్మనంత ...25may12

*  *   *   *   *   *   *

వర్షం నువ్వు నాతో లేవని
ఎక్కిరిస్తుంది ..నిలువెల్లా నీవై తడుపుతూ ...25may12

*  *   *   *   *   *   *

నీ మాటలే నా చెవిపోగులు ..
నువ్వు లేనప్పుడు నీ స్వరం వినిపిస్తూ ...25may12

*  *   *   *   *   *   *

తన తలపులతో నా గొడవ ...
నా ప్రశాంతత నాకిచ్చేయమని ...25may12

*  *   *   *   *   *   *

కలం నాతో దాని గుండె నీతో ...
 రావా..!! అది రాయడం మరిచిపోయేలోపు ...25may12

*  *   *   *   *   *   *

సుగంధమై కౌగలించుకొని
నన్నే మైమరిపించేట్టు చేయడం నీ నేరమే ...!!...25may12

*  *   *   *   *   *   *

సత్యమనే నది దాటితే 
ఆ వైపు గొప్పపేరనే ప్రతిఫలం ఉంది ...24may12

*  *   *   *   *   *   *

నా కన్నీటి ముత్యాలు రాల్చి .. 
తన పెదాల్ని నవ్వుతో అలంకరించాలని ...24may12

*  *   *   *   *   *   *

No comments:

Post a Comment