Tuesday, October 16, 2012

FEMTO'S 
-----------------

చావెక్కడిది ..
శరీరంతో పని లేని నీకు - ప్రేమా ??!!....28may12

*   *   *   *   *   *
నీ గుండె లోతెంతని కళ్ళను -
ప్రశ్నిస్తే ... కన్నీళ్లనడిగి తెలుసుకోమంది ...28may12

*   *   *   *   *   *

ఈ రోజు నవ్వు చెల్లించలేదు ..
అందుకే నా శ్వాస జప్తు చేసుకున్న ప్రేమ ... 28may12

*   *   *   *   *   *

నీ పేరు వినగానే ... 
నవ్వు వెనక పెదాల ఆలింగనం చూడు .. 28may12

*   *   *   *   *   *

నీ ఊపిరి మాలలల్లి
 నా హృదయం తో మాట్లాడించకు .,..27may12

*   *   *   *   *   *

No comments:

Post a Comment