FEMTO'S
----------------
----------------
చీకటి - గతానికి ఒప్పందం ..
చీకటి జ్ఞాపకాన్ని గతంలో పూడ్చాలని ...24may12
* * * * * * *
* * * * * * *
తరంగమై "నే"- తీరమా "నీ "...
పాదాలు తాకుతూ ఆడుతున్న ఆట భలే...23may12
* * * * * * *
* * * * * * *
భారంగా ఒళ్ళు విరుస్తున్న కొమ్మ ..
పువ్వు నిద్రను భంగం చేయొద్దని ...23may12
* * * * * * *
* * * * * * *
అనాధగా చేసిన విధిని
ప్రశ్నిస్తున్నతడి తగ్గిన ఈ మూగ కళ్ళు
* * * * * * *
* * * * * * *
కొడుకా నే చచ్చాక
ఈ ముక్కు పుడక నీ కూతురికివ్వు కానుకగా
* * * * * * *
* * * * * * *
రేపుఈ చోటు నీకు రావద్దు ...
కొడుకా చేవలేదని మూల చూపావ్ కదా
* * * * * * *
* * * * * * *
ఆ ముడతల దారుల నిండా ..
తన వారి కోసం త్యాగం చేసిన ప్రేమే
* * * * * * *
* * * * * * *
నిశబ్దంలో నిర్వచనాలను
వెతుక్కోమన్న ప్రియమైన శత్రువు ...23may12
* * * * * * *
* * * * * * *
No comments:
Post a Comment