Thursday, October 18, 2012

FEMTO'S
--------------


చేతులు కలుపుదామా ... 
కలవవన్న ధృవాలకు దారులయ్యామని ...♥mm♥ 20june2012

* * * * *

ప్రశ్నల ముడులు విప్పమని ..
.నా కళ్ళను నీ అందంతో మూస్తే ఎలా ? ...♥mm♥ 20june2012

* * * * *

హృదయ క్షేత్రాన త్రవ్వినకాలువలు .....
ప్రవహిస్తున్నాయి నీ జ్ఞాపకాలు .....♥ 19june2012

* * * * *

నా కలల్ని మరిగిస్తున్న ...
ఆవిరై నిన్ను చేరి వర్షంలా కురవాలని .....♥mm♥ 19june2012

* * * * *

నా గాయం ఇప్పటికి నవ్వింది ..
నీ పలకరింపు విని సమ్మె మానేస్తానంది...♥mm♥ 19june2012

* * * * *

మా నాన్న ప్రేమను మరిపించు 
అప్పుడు నీ ప్రేమ గొప్పదని ఒప్పుకుంటా ...♥ 17june2012

* * * * *

గాలి కెంత ధైర్యమో ..
చూడు మబ్బు చీరని చింపి చంద్రునికి చుడుతుంది ...♥ 16june2012

* * * * *

No comments:

Post a Comment