Tuesday, October 16, 2012

FEMTO'S
------------------


నా గాయానికి పేరు పెట్టా .. 
తీరా అది నీ పేరై కూర్చుంది ...2may12

*     *    *    *    * 

నీ చూపుల చిక్కుముడుల్లో 
తన అందానికి దారి చెప్పు ...2may12

*     *    *    *    * 

నా ఊపిరి స్తానం ఇప్పుడు
నీ హృదయ కుహరం

*     *    *    *    * 


వెళ్తున్న మూగబోయిన తన 
గొంతు దారుల్లో స్వరాన్ని వెతకాలని ...2may12

*     *    *    *    * 

తాకనిస్తావా ..
ఆ పసిడి కన్నుల ఒలికిన ప్రేమని ?..2may12

*     *    *    *    * 

తన ప్రేమ ముందు
చిన్నబోయిన ఎవరెస్టు ..2may12

*     *    *    *    * 

నా మనసును గోడగా చేసి .. 
నీకు రక్షణ అవ్వాలనా ? ...2may12

*     *    *    *    * 

నీవైపు చేర్చే మెట్లెక్కుతున్నా .. 
ఎంతకి నీ దగ్గరికి చేరలేక పోతున్నా...2may12

*     *    *    *    * 

నీ తలపుల మత్తు జల్లి .. 
నా పేరడిగితే నీది చెప్పిచ్చి నవ్వుతవా ?...2may12

*     *    *    *    * 

తడి లేని హృదయం .. 
నిన్ను కోల్పోయి నిర్జీవమై ..2may12

*     *    *    *    * 

మూసేసిన గదిలో నన్నుంచి ..ప్రేమిస్తాడట ...1may12

*     *    *    *    * 

పిలవడానికి పేరు కావాలా ..
 తలపు చాలదా ?...1may12

*     *    *    *    * 

No comments:

Post a Comment